బతుకమ్మ:బిచ్కుంద : బిచ్కుంద మండలంలోని చిన్న దడిగి గ్రామంలో మంగళవారం ఘనంగా ఎల్లమ్మ బోనాలను నిర్వహించారు. అత్యంత భక్తిశ్రద్ధలతో అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఎల్లమ్మ బోనాలు ఘనంగా చేస్తామని తెలియజేశారు. ఎల్లమ్మ బోనాల పండుగ సందర్భంగా గ్రామంలో భారీ ఎత్తున అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పాల్గొన్నారు.
