అర్హుల పేర్లు రాలే..

బతుకమ్మ,ముప్కాల్: ముప్కాల్ మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన గ్రామసభ రసాభసాగా జరిగింది. ఇందిరమ్మ ఇండ్ల జాబితలో అర్హుల పేర్లు రాలేవని గ్రామస్తులందరు అధికారులను నిలదీశారు. అర్హత కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి పథకాలు అందించాలని గ్రామస్తుల అధికారులను తెలిపారు. దీంతో ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని నచ్చచెప్పి గొడవను సద్దుమనుగ చేశారు.