Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 April 2025, 4:14 pm Posted by : ramakrishna

అర్హులను ఎంపిక చేయాలి

  • జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

 

కామారెడ్డి, బతుకమ్మ : అర్హత కలిగిన నిరుపేద కుటుంబాల వారిని ఇందిరమ్మ ఇండ్ల జాబితా కు ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. గురువారం పాల్వంచ, మాచారెడ్డి మండల కేంద్రాలలో ఆయా మండలాల పంచాయతీ కార్యదర్శులతో కలెక్టర్ మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు నిరుపేద వర్గాల కుటుంబాల వారిని ఎంపిక చేసే విధంగా ఆయా ఇందిరమ్మ కమిటీ సభ్యులకు తెలియజేయాలని అన్నారు. అర్హల జాబితాలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా నిర్వహించాలని తెలిపారు. గ్రామ పంచాయతీ వారీగా సర్వే నిర్వహించాలని అన్నారు. అనంతరం మాచారెడ్డి లో నిర్మిస్తున్న మోడల్ ఇందిరమ్మ ఇంటిని కలెక్టర్ పరిశీలించారు. ఈ సమావేశాలలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చందర్ నాయక్, మండల ప్రత్యేక అధికారి సురేష్, జిల్లా పంచాయతీ అధికారి మురళీ, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

Eligible candidates should be selected