Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 November 2024, 6:52 pm Posted by : ramakrishna

పవర్ హౌస్ కాంపౌండ్ లో విద్యుత్ ఉద్యోగుల నిరసన

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: వికారాబాద్ కలెక్టర్ అధికారులపై దాడి, నిజామాబాద్ జిల్లాలో అసిస్టెంట్ లైన్ మెన్ నవీన్ పై దాడిని ఎలక్ట్రిసిటీ జేఏసీ తీవ్రంగా ఖండించింది. మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ జెయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో పవర్ హౌస్ లో నిరసన కార్యక్రమం చెపట్టింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నిజామాబాద్ జిల్లా ఎస్ ఈ రాపల్లి రవీందర్ మాట్లాడుతూ బోధన్ సంఘం గ్రామంలో పనిచేస్తున్న అసిస్టెంట్ లైన్మెన్ శ్రీ నవీన్ పై దాడి చేయడం ఆటవిక చర్యగా పేర్కొన్నారు , వికారాబాద్ జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారులపై లచ్చగొర్ల గ్రామం దాడిని తీవ్రంగా ఖండించారు. విద్యుత్ సిబ్బంది గ్రామాలలో 24గంటలు పని చేస్తూ ,రెవెన్యూ వసూళ్లకు వచ్చినప్పుడు ఒక మహిళ ఉట్పల్లి గ్రామంలో తీవ్రంగా దాడి చేయడానికి ఖండించారు. మహిళపై కఠిన చర్యలు తీసుకోవాలని అసిస్టెంట్ లైన్మెన్ కు అండగా మేనేజ్మెంట్ ఉంది అని చెప్పారు. జేఏసీ కన్వినర్ ఎస్ఎఓ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం చేసినటువంటి శాసనాలను ఉద్యోగులు అమలు చేస్తామన్నారు బహిరంగ విచారణకు వచ్చిన కలెక్టర్ పై దాడి చేయడం శోచనీయమన్నారు మా విద్యుత్ సిబ్బందిపై కూడా ఇకముందు దాడిలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు .1104యూనియన్ కంపెనీ ప్రెసిడెంట్ రఘునందన్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులపై దాడి చేయడం సరైనది కాదని ప్రభుత్వానికి ప్రజలకు మధ్యగా సేవ చేయడమే మా లక్ష్యం మరి మాపై దాడి చేయడం అనేది భావ్యం కాదు ఒక కలెక్టర్ పైన దాడి చేశారంటే ప్రజాస్వామ్యం లో పద్ధతి కాదు అన్నారు. మా అసిస్టెంట్ లైన్మెన్ నవీన్ పై దాడి బిల్లు కట్టమని వస్తే దాడి చేయడం పిరికిపంద చర్య అని మీకు ఏమైనా సమస్యలు ఉంటే పై అధికారులకు తెలుపవలసిన అవసరం ఉందని చెప్పారు అసిస్టెంట్ లైన్మెన్ కి జేఏసీ అండగా ఉంటుందని చెప్పారు త్రీ ట్వంటీ సెవెన్ యూనియన్ సెక్రటరీ గంగాధర్ మాట్లాడుతూ బహిరంగ విచారణకు వచ్చినప్పుడు సమస్యలు విన్నవించుకునేది పోయి దాడులకు పాల్పడడం సరైనది కాదని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు ఈ కార్యక్రమంలో జేఏసీ కో కన్వీనర్ తోట రాజశేఖర్ డి ఈ లు ఏ రమేష్, వెంకటరమణ, జేఏసీ నాయకులు సురేష్, కుమార్, జి శ్రీనివాస్, రాజేందర్ రెడ్డి,గంగారం నాయక్,నాంపల్లి, శ్రీనివాసరావు, వేణుగోపాల్, ఆర్ చంద్రశేఖర్, రాజేందర్, నగేష్ కుమార్, పిఓ పోశెట్టి, నిజాముద్దీన్, సునీత, సరిత , సుమిత, గౌతమి, దివ్య, హరికృష్ణ, బల్ల శ్రీనివాస్, శివకుమార్, డిసి రాజు, సతీష్ కుమార్ ,విద్యుత్ ఉద్యోగులు పాల్గొని నిరసన వ్యక్తం చేశారు.

Electricity workers protest in power house compound