- డివిజన్ ఏర్పాటు చేయాలని వినతి
- మంత్రి, పిసిసి చేతికి బతుకమ్మ కథనాలు
డిచ్పల్లి బతుకమ్మ: డిచ్పల్లిలో డివిజన్ కార్యాలయం ఏర్పాటు విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని, దీనిని వెంటనే విభజించాలని ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుకు విద్యుత్ ఉద్యోగులు కలిసి వినతి పత్రం అందజేశారు. డిచ్పల్లి లో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ సమావేశానికి మంత్రి హాజరయ్యారు. ఉభయ జిల్లాకు ఆయననే పెద్ద దిక్కు కావడంతో డిచ్పల్లి పరిధిలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది కొందరు రైతు సంఘ నాయకుల ద్వారా మంత్రి కి, పిసిసికి వినతి పత్రంతో పాటు బతుకమ్మ కథనాలను అందజేశారు. ఏంటి సంగతి అని మంత్రి అడిగారు. వినియోగదారులకు దూర భారం తగ్గించేందుకు గాను డిచ్పల్లిలో డివిజన్ మంజూరు అయ్యింది. ఇప్పటివరకు ఏర్పాటు చేయలేదని దీని ని ఉటంకిస్తూ బతుకమ్మ పత్రికలో వరుస కథనాలను వెలువరిస్తున్నారని మంత్రికి వివరించారు. సానుకూలంగా స్పందించిన ఆయన నొప్పి ఏను పిలిచి డివిజన్ విజయమై తనకు గుర్తు చేయాలని ఆదేశించారు.