Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 October 2025, 7:43 pm Posted by : ramakrishna

పొలం బాట పట్టిన విద్యుత్ అధికారులు

 

బిచ్కుంద, బతుకమ్మ :

బిచ్కుంద  మండల పరిధిలోని పెద్ద దడ్గి గ్రామంలో  విద్యుత్ అధికారులు పొలం బాట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతులతో చర్చలు జరిపి, విద్యుత్ వినియోగంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.వ్యవసాయ కార్యకలాపాల్లో విద్యుత్ ప్రమాదాలను నివారించేందుకు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు,మోటార్లకు కేపాసిటర్లను అమర్చడం వల్ల విద్యుత్ వినియోగం తగ్గడం, మోటార్ల పనితీరు మెరుగుపడడం వంటి ప్రయోజనాలు,విద్యుత్ సంబంధిత అత్యవసర పరిస్థితులలో *1912 టోల్‌ఫ్రీ నెంబర్*‌కు కాల్ చేయడం ద్వారా తక్షణ సహాయం పొందగలమన్న విషయాలపై స్పష్టతనిచ్చారు. ఈ అవగాహన కార్యక్రమానికి రైతులు మంచి స్పందన చూపారు. విద్యుత్‌ను జాగ్రత్తగా వినియోగించడం ద్వారా ప్రమాదాలు నివారించవచ్చన్న భావనలో వారు చైతన్యంతో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈ పవన్ కుమార్ లైన్మెన్ మల్లికార్జునరావు, తదితర అధికారులు పాల్గొన్నారు.

Electricity officials hit the farm trail