- మెరుగైన, నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం
- వంగిన పోల్స్, లూజ్ లైన్ లను సరిచేయనున్న అధికారులు
నిజామాబాద్, బతుకమ్మ : రైతుల విద్యుత్ సమస్యల పరిష్కారానికి విద్యుత్ అధికారుల పొలంబాట కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఇందులో వంగిన పోల్ లను లూజ్ లైన్ లను సరిచేయనున్నారు. మధ్య స్తంబాలను ఏర్పాటు చేసి తీగల మధ్య అవసరం ఉన్న చోట స్పీసర్స్ పెట్టనున్నారు. ఇప్పటివరకు పొలంబాట కార్యక్రమం ద్వారా వంగిన వోల్ లు 543, లూజ్ లైన్లు 437 తక్కువ ఎత్తులో ఉన్న ట్రాన్స్ఫార్మర్ల గద్దెలు 631 మార్చారు. రైతులకు మరింత మెరుగైన, నాణ్యమైన నిరంతర విద్యుత్ సరఫరా అందించడానికి, వారి సమస్యల పరిష్కార ధ్యేయంగా పొలంబాట కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తుంది. రైతులకు విద్యుత్ ప్రమాదాల పట్ల అవగహన కల్పించనున్నారు. విద్యుత్ పట్ల జాగ్రత్తగా ఉండాలని ముఖ్యంగా రైతు సోదరులు తమ వ్యవసాయ అవసరాల నిమిత్తం, వ్యవసాయ పంపు సిట్లను వినియోగించినప్పుడు కరెంటు మోటార్లు, ఫుట్ వాల్వులు, సర్వీసు వైర్లకు ఇన్సులేషన్ విద్యుత్ ప్రసారం జరిగి ప్రమాదాలు జరుగుతాయి. కరెంటు మోటార్లను కాని, పైపులను కానీ, ఫుట్ వాల్వులను కాని ఏమరపాటుతో తాకకూడదు. వ్యవ సాయ పంపుసెట్లను, స్టార్టర్లను విధిగా ఎర్త్ చేయాలి. విద్యుత్ ప్రమాదాలు ఎర్త్ చేయబడని పరికరాల వల్లే జరుగుతాయి. అలాగే దీనితో పాటుగా విద్యుత్ సరఫరాలో హెచ్చు తగ్గులు లేకుండా మెరుగైన సరఫరా అందించడానికి వ్యవసాయ పంపుసెట్లకు కెపాసిటర్లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. కెపాసిటర్లు పెట్టుకోవడం వలన మోటార్ల జీవిత కాలం పెరుగుతుంది. వోల్టేజి సమస్య ఉండదు. కెపాసిటర్లు అమర్చడం వలన రీయాక్టివ్ పవర్ కాంపన్సేషన్ ద్వారా పవర్ ఫాక్టర్ మెరుగు పడి ట్రాన్స్ఫార్మర్లపై లోడ్ భారం తగ్గి మోటార్లు కాలిపోకుండా మన్నిక పెరుగుతుంది.
ఒకవేళ ట్రాన్స్ఫార్మర్లు ఫెయిల్ అయితే వ్యవసాయదారులు వెంటనే 1912 ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలి. ఆ ఫిర్యాదు సమాచారం వెంటనే వెబ్ అప్లికేషన్ ద్వారా సంబంధిత అధికారి మొబైల్ యాప్ కి వెళ్తుంది. సదరు అధికారి ఆ ట్రాన్స్ఫార్మర్ ను చెక్ చేసి ఫెయిల్ అయ్యిందని నిర్ధారించుకొని వెంటనే ఫెయిల్ అయ్యిందని యాప్ లో నమోదుచేస్తే సంబంధిత ఎస్పీఎం షెడ్ అధికారికి ఆ సమాచారం వెళ్తుంది. ఆ తర్వాత ఎస్పీఎం పెడ్ అధికారి వెంటనే మరొక ట్రాన్స్ఫార్మర్ ను ఏర్పాటు చేసి ఆ అధికారికి ట్రాన్స్ఫార్మర్ ను తీసుకు వెళ్ళవలసిందిగా సమాచారం యాప్ లో నమోదు చేయడం తో ఆ సమాచారం వెళ్తుంది. ఆ ట్రాన్స్ఫార్మర్ ను ఫెయిల్ అయిన చోట ఏర్పాటు చేయడం తో ఫిర్యాదు చేసిన రైతుకు ట్రాన్స్ఫార్మర్ ను ఏర్పాటు చేయడం జరిగిందని మెసీజ్ వెళ్తుంది. ఇలా త్వరిత గతిన ట్రాన్స్ఫార్మర్ లను మార్చడం వలన రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా విద్యుత్ సరఫరా అందించడం జరుగుతుంది. ఈ ప్రక్రియలో ఒక వేళ 48 గంటలు దాటి ఆలస్యం జరుగుతుందని గుర్తిస్తే పై అధికారులు వెంటనే స్పందించి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకొని యుద్దప్రాతిపదికన ఏర్పాట్లు జరిగేటట్లు చేస్తారు. రైతులందరూ 1912 కి ఫోన్ చేసి తమ సమస్యను తెలపాలి. రైతులు, వినియోగదారులు స్వయంగా విద్యుత్ శాఖకు తెలపకుండా స్వయంగా కరెంట్ పనులను చేసుకొని నిండు ప్రాణాలు కోల్పుతున్నారు. కాబట్టి 24/7 అందుబాటులో ఉండి విద్యుత్ శాఖ సిబ్బంది ని సంప్రదించి పనులను చేసుకోవాలి.