పోచారం అంగన్వాడీ కేంద్రానికి విద్యుత్ మీటర్ కనెక్షన్ ఏర్పాటు
ఎడపల్లి, బతుకమ్మ : పోచారం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో గ్రామ సర్పంచ్ నీరడి జ్యోతి రవికుమార్ సమక్షంలో విద్యుత్ మీటర్ కనెక్షన్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ జ్యోతి రవికుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలకు ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రభుత్వ సలహాదారులు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. నిజామాబాద్ కన్స్ట్రక్షన్ ఏడీఈ తోట రాజశేఖర్ మాట్లాడుతూ రెండో విడతలో బోధన్ డివిజన్ పరిధిలో 78 అంగన్వాడీ కేంద్రాలకు, ఎడపల్లి మండలంలోని 11...