Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 June 2026, 5:18 pm Posted by : ramakrishna

పోచారం అంగన్వాడీ కేంద్రానికి విద్యుత్ మీటర్ కనెక్షన్ ఏర్పాటు

 

ఎడపల్లి, బతుకమ్మ :

 

పోచారం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో గ్రామ సర్పంచ్ నీరడి జ్యోతి రవికుమార్ సమక్షంలో విద్యుత్ మీటర్ కనెక్షన్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ జ్యోతి రవికుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలకు ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రభుత్వ సలహాదారులు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. నిజామాబాద్ కన్స్ట్రక్షన్ ఏడీఈ తోట రాజశేఖర్ మాట్లాడుతూ రెండో విడతలో బోధన్ డివిజన్ పరిధిలో 78 అంగన్వాడీ కేంద్రాలకు, ఎడపల్లి మండలంలోని 11 అంగన్వాడీ కేంద్రాలకు ఉచితంగా విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా శుక్రవారం పోచారం, ధర్మారం, వడ్డేపల్లి అంగన్వాడీ కేంద్రాలతో పాటు బాపునగర్, నెహ్రూనగర్, తానాకలాన్, కుర్నాపల్లి గ్రామాల్లో కూడా విద్యుత్ మీటర్లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ జక్కు పూజిత, వార్డు సభ్యులు తాడెం మమత, దండెం సాయిలు, వీడీసీ క్యాషియర్ ఒడ్డెటి లక్ష్మీనారాయణ, బజానోళ్ల నవీన్, శంకర్, ప్రేమానంద్, గోపి, యశ్వంత్ తదితరులతో పాటు అంగన్వాడీ టీచర్ పాల్గొన్నారు.

 

Electricity meter connection installed at the Pocharam Anganwadi center.