Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 May 2025, 12:37 pm Posted by : ramakrishna

అసిస్టెంట్ లైన్ మన్ మృతికి విద్యుత్ ఉద్యోగుల సంతాపం

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: బోధన్ మండలం రాజీవ్ నగర్ తండాలో కరెంట్ షాక్ తో అసిస్టెంట్ లైన్ మన్ మహేందర్ గురువారం మృతి చెందిన విషయం తెలిసిందే. పట్టణంలోని పవర్ హౌస్ సమావేశపు గదిలో శుక్రవారం  మహేందర్ మృతికి విద్యుత్ ఉద్యోగులు సంతాపం తెలిపారు.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించారు. ఈకార్యక్రమంలో  జిల్లా ఎస్ ఈ రవీందర్ , నిజామాబాద్ డీ ఈ ఈలు శ్రీనివాస్, రమేష్, వెంకటరమణ, ఎస్ ఏ ఓ శ్రీనివాస్, నాయకులు రఘునందన్, తోట రాజశేఖర్, రాజేందర్, కాశీనాథ్, సురేష్ కుమార్ ,శ్రీధర్, రాజేందర్, నగేష్ కుమార్, చంద్రశేఖర్, చెన్నయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు  మాట్లాడుతూ విద్యుత్ పనులు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమం లో పవర్ హౌస్  విద్యుత్ ఇంజనీర్లు, విద్యుత్ శాఖ ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు.