Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 March 2025, 6:04 pm Posted by : ramakrishna

ఫోన్ కాల్ తో రైతులను ఆదుకున్న విద్యుత్ శాఖ ఎస్ఈ

ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఆరుగాలం కష్టపడి పంట పండించుకునే రైతులకు రబీలో ట్రాన్స్ఫార్మర్ పలుమార్లు చెడిపోయింది. దాన్ని స్థాయి పెంచాలని అధికారులకు మొరపెట్టుకున్న స్పందించ లేదు. చివరికి మాజీ జెడ్పిటిసి సాయంతో ఎస్ఈకి ఫోన్ చేస్తే నాలుగు గంటల్లో100 కేవీ ట్రాన్స్ఫార్మర్ను అందించారు. ఈ సంఘటన శనివారం రామారెడ్డి మండలం మోసంపూర్ గ్రామం లో చోటు చేసుకుంది. దీంతో ఆ అధికారికి ఆ గ్రామ రైతులు కృతజ్ఞతలు తెలిపారు. తమకు మీరే దేవుడని తమ కళ్ళముందే తమ పంటలు ఎండిపోతున్నాయని ఏం చేయలేకపోతున్నామన్నారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం మోషన్ పూర్ గ్రామంలో ఎస్ఎస్ 3 ట్రాన్స్ఫార్మర్ గత ఏడాది నుంచి ఓవర్ లోడ్ తో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ట్రాన్స్ఫార్మర్ కింద 15 మంది రైతులు ఉండగా మోటార్లు చాలు చేస్తే ఫెస్ వైరు పోయి మరోపక్క ట్రాన్స్ఫార్మర్ పలుమార్లు కాలిపోయింది. దీంతో రైతులు 63 నుంచి 100కు పెంచాలని గత ఏడాది నుంచి మొరపెట్టుకున్న ఫలితం దక్కలేదు. దీంతో గత్యంతరం లేక ఎండిన పొలంకర్రలతో సదాశివ నగర్ ఉమ్మడి మాజీ జెడ్పిటిసి రాజేశ్వరరావు కలిశారు. ఎలాగైనా తమకు ట్రాన్స్ఫార్మర్ ఇప్పించి పంటలను కాపాడాలని మొరపెట్టుకున్నారు.దీంతో ఆయన ముందుగా రామారెడ్డి ఏఈతో మాట్లాడారు. అయినా ఫలితం దక్కకపోవడంతో డి ఈ తో మాట్లాడారు. రైతుల బాధ తీర్చకపోవడంతో శనివారం రైతులు మళ్లీ కామారెడ్డి లో ఉన్న మాజీ జెడ్పిటిసి ని కలిశారు. దీంతో ఆయన విద్యుత్ శాఖ ఎస్ఈ శ్రావణ్ కుమార్ కి ఫోన్లో మాట్లాడి సమస్యను వివరించడమే కాకుండా, ఎండిపోతున్న పొలాల ఫోటోలను కూడా పెట్టారు.

Electricity Department SE who supported the farmers with a phone call

దీంతో స్పందించిన ఎస్ఈ ఇలాంటి సమస్యను తమ దృష్టికి ఎందుకు తీసుకురాలేదని అధికారులపై మండిపడి నాలుగు గంటల్లో ప్రభుత్వ వాహనంలో 100 కేవీ ట్రాన్స్ఫార్మర్ను మోశంపూర్ కు పంపి రైతులను ఆదుకోవడంతో రైతుల ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఎండిపోతున్న తమ పంటలను మాజీ జెడ్పిటిసి రాజేశ్వరరావు, ఎస్ఈ శ్రావణ్ కుమార్ ప్రాణం పోశారని ఆనందం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రైతుల సమస్యలపై కిందిస్థాయి అధికారులు స్పందించి పనిచేస్తే ఇలాంటి ఇబ్బందులు రావని రైతులన్నారు.దీంతో వెంటనే ట్రాన్స్ఫార్మర్లు చూసిన రైతులు ఆనందాన్ని ఆపుకోలేక కామారెడ్డి లోని విద్యుత్ శాఖ కార్యాలయానికి మాజీ జెడ్పిటిసి ని తీసుకెళ్లి ఎస్సీ శ్రావణ్ కుమార్ కు శాలువాతో సన్మానించారు.

Electricity Department SE who supported the farmers with a phone call