. . . ఇంటింటికీ వెళ్లి అందజేస్తున్న విద్యుత్ అధికారులు సిబ్బంది
బాన్సువాడ బతుకమ్మ:
బాన్సువాడ పట్టణంలోని పలు వార్డుల్లో విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు శుక్రవారం సాయంత్రం పర్యటించారు. రాష్ట్ర ప్రభుత్వం గృహ అవసరాలకు గృహ జ్యోతి ద్వారా సద్వినియోగం చేసుకోవాలని సర్కిల్ సీనియర్ అకౌంట్ ఆఫీసర్(ఎస్ఏవో) రాజ శేఖర్ టౌన్ సిబ్బందితో కలిసి విద్యుత్ వినియోగదారులకు గృహ జ్యోతి సంక్రాంతి గ్రీటింగ్ కార్డు అందజేస్తున్నారు. ఈ సందర్బంగా విద్యుత్ శాఖ అధికారి మాట్లాడుతూ 200 యూనిట్లు ఉచిత గృహజ్యోతి పథకం కాపీలను లబ్దిదారులకు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. గృహ జ్యోతి పథకంపై ఇంటింటికి వెళ్లి సంక్రాంతి గ్రీటింగ్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు హామీల్లో భాగంగా గృహజ్యోతి పథకం ద్వారా నెలకు 200 యూనిట్ల వరకు మీ కుటుంబానికి ఉచిత విద్యుత్ ప్రభుత్వం అందిస్తుందన్నారు. విద్యుత్ బిల్లును ప్రభుత్వం నేరుగా విద్యుత్ సంస్థలకు చెల్లిస్తుందని తెలిపారు. లబ్దిదారులు విద్యుత్ బిల్లుల కోసం ఖర్చు చేసే డబ్బును పిల్లల చదువు, ఆరోగ్యం, కుటుంబ అవసరాలకు ఉపయోగించుకోవచ్చని వారన్నారు. అర్హత ఉన్నవారు లబ్ధి పొందకపోతే వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మార్పులు ఉన్న నూతనంగా దరఖాస్తు ఉన్న మున్సిపల్ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాజశేఖర్, ఏడీఏ సంజీవ్ రావు, ఏఏవో కనకరాజు, ఏఈ సంతోష్ కుమార్ తదితరులు ఉన్నారు.