Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 July 2025, 6:38 pm Posted by : ramakrishna

4న విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక

భీమ్ గల్, బతుకమ్మ : విద్యుత్ వినియోగధారుల సమస్యల పరిష్కార వేదిక (సీఆర్ఆర్ఎఫ్)ను భీమ్ గల్ సబ్ సెంటర్ లో శుక్రవారం నిర్వహించనున్నట్లు భీమ్ గల్ ఏ. డీ బి. వినోద్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 1 వరకు నిర్వహించనున్నట్లు అయన తెలిపారు. వినియోగధారులకు ఏమైనా సమస్యలు ఉంటే ఈ వేదిక ద్వారా పరిష్కరించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సీజిఆర్ఎఫ్ టూ చైర్మన్ ఎరుకల నారాయణ, టెక్నికల్ మెంబర్ సలంధ్ర రామకృష్ణా, మెంబర్ అఫ్ ఫైనాన్స్ లకావత్ కిషన్, సీ జీ ఆర్ ఎఫ్ ఫోర్త్ మెంబర్ మర్రిపల్లి రాజగౌడ్, ఆర్మూర్ డీ ఈ రాజేశ్వర్, భీమ్ గల్ ఏ ఈ గవస్కార్, భీమ్ గల్ టౌన్ ఏ ఏ ఈ సత్య ప్రసాద్, వేల్పూర్ ఏ ఏ ఈ యశ్వంత్ రావులు పాల్గొననున్నారని వినోద్ తెలిపారు.