మెండోరా, బతుకమ్మ :
బాల్కొండ నియోజకవర్గం లోని సాంఘిక సంక్షేమ గురుకులం లో ఎలక్ట్రీషియన్ గా పనిచెస్తున్న నెహ్రు అనే వ్యక్తి ని అరెస్ట్ చేసినట్టు మెండోరా ఎస్ఐ సుహాసిని తెలిపారు. గురుకులం చదువుతున్న పదవతరగతి చదువుతున్న విద్యార్థి పట్ల నెహ్రు అసభ్యకరంగా వ్యవహరించారు. ఈ విషయం పై విద్యార్థిని గురుకుల అధికారులు ద్రుష్టి కి తీసుకువెళ్లిన పట్టించుకోలేదు. దానితో తాను ఆత్మహత్య చేసుకుంటానని తల్లిదండ్రులకు లేఖ రాయడం తో విషయం బహిర్గతం అయింది. బాధిత విద్యార్థి తల్లిదండ్రులు పిర్యాదు చేయడం తో కేసు నమోదు చేసిన పోలీసులు జక్రాన్ పల్లి కి చెందిన నెహ్రు ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరిలించారు.