విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ధ్వంసం

కాపర్ వైర్ చోరీ   బతుకమ్మ, భిక్కనూరు: భిక్కనూరు మండలంలోని బస్వాపూర్ గ్రామంలో గుర్తుతెలియని దుండగులు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ చోరీ చేసిన ఘటన శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కురుమ లచ్చయ్యకు చెందిన వ్యవసాయ బావి వద్ద ట్రాన్స్ఫార్మర్ గుర్తుతెలియని వ్యక్తులు కింద పడేసి అందులోని కాపర్ వైర్ చోరీ చేశారన్నారు. ఈ మేరకు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి ఎస్సై ఆంజనేయులు చేరుకొని  కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసినట్టు తెలిపారు. విద్యుత్  ట్రాన్స్ఫార్మర్ వైర్...