డిష్‌, ఇంటర్నెట్‌ కేబుళ్లను తొలగించిన విద్యుత్‌ సిబ్బంది

బతుకమ్మ బాన్సువాడ : టీజీ ఎన్‌పీడీసీఎల్‌ సీఎండీ వరుణ్‌రెడ్డి ఆదేశాల మేరకు బాన్సువాడ పట్టణంలోని పలు చోట్ల విద్యుత్‌ స్తంభంపై అస్తవ్యస్తంగా ఉన్న డిష్‌, ఇంటర్నెల్‌ కేబుళ్లను విద్యుత్‌ సిబ్బంది మంగళవారం తొలగించారు.మున్సిపాలిటీ పరిధిలోని కేబుల్‌, ఇంటర్నెట్‌ ఆపరేటర్లు వారి కేబుళ్లను సక్రమ పద్ధతిలో క్లిప్పింగ్‌ క్లాంపిన్‌ పద్ధతి అనుసరించి విద్యుత్‌ ప్రమాదాలు జరగకుండా చూడాలని విన్నవించారు.ఈ కార్యక్రమంలో జి. సంతోష్ కుమార్,ఎఎఈ, బీర్మల్/ ఫ్ఎం, రాజేంద్ర ప్రసాద్/ ఎల్ఐ, బలరామ్ యాదవ్ బాన్సువాడ టౌన్ సెక్షన్ సిబ్బంది ఉన్నారు.