నిజాంసాగర్, బతుకమ్మ: స్నానం కోసం వాటర్ హీటర్ తో నీళ్లను వేడి చేస్తుండగా షాక్ తగిలి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మహ్మద్ నగర్ మండలం తుంకిపల్లిలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రౌతు సాయిలు (53) హైదరాబాద్ వెళ్లేందుకు తయారవుతున్నాడు. ఇందులో భాగంగా స్నానం కోసం వాటర్ హీటర్ తో నీటిని వేడి చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు షాక్ తగిలి మృతి చెందాడు. మృతుడి కుమారుడు రౌతు సతీశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.