Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 November 2025, 12:36 pm Posted by : ramakrishna

 విద్యుత్ స్తంభానికి మంటలు

 బోధన్, బతుకమ్మ  : బోధన్ పట్టణంలోని సరస్వతి నగర్‌లో శనివారం ఉదయం షార్ట్ సర్క్యూట్ కారణంగా విద్యుత్ స్తంభానికి మంటలు చెలరేగాయి.  స్థానికులు వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం ఇవ్వడంతో, అగ్నిమాపక సిబ్బంది తక్షణమే ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.  అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. అయితే విద్యుత్ తీగలు, మీటర్ బాక్స్ కొంత మేరకు దెబ్బతిన్నాయి. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో కొంతసేపు విద్యుత్ సరఫరా నిలిపివేశారు.  కేబుల్ బాక్స్‌లో ఉడుత చిక్కుకోవడంతో షార్ట్ సర్క్యూట్ సంభవించినట్లు ఏఈ కృష్ణ తెలిపారు.


Electric pole on fire


Electric pole on fire