నిజామాబాద్ నుండి హైదరాబాద్ కు ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభం
బతుకమ్మ : నాగిరెడ్డిపేట్ : నిజామాబాద్ డిపో నుండి వయా వర్ని, బాన్సువాడ, ఎల్లారెడ్డి, మెదక్, నర్సాపూర్ మీదుగా హైదరాబాద్ వరకు ఎలక్ట్రిక్ బస్సులను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ నిజామాబాద్ డిపో అధికారులు ప్రారంభించారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఆధునాతనమైన ఎలక్ట్రిక్ ఎక్స్ ప్రెస్ బస్సులను ప్రారంభించడంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బాన్సువాడ డిపో మేనేజర్ ఆదేశాల మేరకు నిజామాబాద్ డిపో నుండి ఎలక్ట్రిక్ బస్సులు మోస్రా, వర్ని, బాన్సువాడ, నిజాంసాగర్, ఎల్లారెడ్డి, మెదక్, నర్సాపూర్ మీదుగా హైదరాబాద్ వరకు మూడు...