.. ఓటింగ్ పూర్తయ్యే వరకు ప్రజలు సహకరించాలి
.. డిచ్ పల్లి సిఐ వినోద్
ఇందల్వాయి,బతుకమ్మ :
జరగబోయే గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా సిర్నాపల్లి గ్రామంలో ఇందల్వాయి పోలీసు శాఖ తరపున గ్రామ ప్రజలతో సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా డిచ్ పల్లి సిఐ వినోధ్ హజరై మాట్లాడుతూ.. గ్రామపంచాయతీ ఎన్నికల సమయంలో ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారం ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించుకోవలసిందిగా కోరారు. ప్రచారంలో చేసే సమయంలో ఎలాంటి అంచనీయ సంఘటనలకు తావివ్వకుండా గ్రామంలో ఎన్నికలు జరుపుకోవాలని సూచించారు.ఎలక్షన్ కోడ్ ఉన్నంతవరకు చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేసిన వారిపై ఎలక్షన్ రూల్స్ ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని ప్రజలకు తెలిపారు.ఎవరైనా ఎన్నికల సందర్భంగా ర్యాలీలు నిర్వహించాలి అనుకుంటే సంబంధించిన రిటర్నింగ్ అధికారి,పోలీస్ అధికారుల అనుమతి తప్పనిసరిగా ఉండాలన్నారు.అనుమతి లేకుండా ర్యాలీలు నిర్వహించడం చట్టపరమైన చర్యలకు కారణం అవుతుందన్నారు. రాజకీయపార్టీల అభ్యర్థులు, నిర్వాహకులు నియమాలను పాటించలన్నారు.ఎన్నికల ప్రక్రియ సవ్యంగా సాగేందుకు పోలీసు శాఖకు సహకరించాలని కోరారు.అంతేకాకుండా ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న సైబర్ నేరాల గురించి అవగాహన కల్పించడం,రోడ్డు ప్రమాదాలు నివారణకై తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన వారికి చట్టపరమైన కఠిన శిక్షలు ఉంటాయని తెలియపరిచారు.ఈవ్ టీజింగ్, డ్రగ్స్ విషయలలో కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్సై సందీప్,గ్రామస్తులు పాల్గొన్నారు.