ఎన్నికలు సమర్ధవంతంగా నిర్వహించాలి
అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వి.విక్టర్ కామారెడ్డి, బతుకమ్మ : మండల, జిల్లా ప్రాదేశిక నియోజక వర్గాల ఎన్నికలు సమర్ధవంతంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వి.విక్టర్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మండల పరిషత్ ప్రాదేశిక నియోజక వర్గాలకు, జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజక వర్గాలకు జరిగే ఎన్నికలు సమర్ధవంతంగా ఎన్నికల నియమావళి మేరకు ఎన్నికలు నిర్వహించాలని తెలిపారు. రిటర్నింగ్ అధికారులకు, సహాయ రిటర్నింగ్ అధికారులకు...