వాహనాలను తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు

  బాల్కొండ, బతుకమ్మ: స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా వాహనాలను ఎన్నికల అధికారులు బుధవారం తనిఖీ చేశారు. బాల్కొండ మండల కేంద్రంలో జిల్లా పరిషత్ హై స్కూల్ రహదారిపై వాహనాలు అపి వేసి సోదాలు చేశారు. ఎన్నికల కోడ్ అమలు అవుతున్న సందర్భంగా ఎవరు కూడా మద్యం, ఎక్కువ మొత్తంలో డబ్బులు దొరికితే జప్తు చేయడం జరుగుతుందని తెలిపారు. ఎన్నికల నియమావళిని దృష్టిలో ఉంచుకొని ఎవరైనా డబ్బులు తీసుకుని పోయినట్లయితే దానికి  సంబంధించిన పూర్తి వివరాలు  ఉండాలని పేర్కొన్నారు.