టీఎన్జీఓ అర్బన్, రూరల్ యూనిట్ కమిటీ ఎన్నిక
నిజామాబాద్, బతుకమ్మ: టిఎన్జీవో కేంద్ర సంఘ అధ్యక్షులు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ఎస్ఎం. హుస్సేని ఆదేశానుసారం బుధవారం టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్ ఆధ్వర్యంలో 2024-2027 సంవత్సరానికి టీఎన్జీఓ అర్బన్, రూరల్ యూనిట్ ల ఎన్నికలు నిర్వహించారు. ఎన్నిక అధికారులుగా వనమాల సుధాకర్, జి.సంజీవయ్య, దినేష్ బాబు, విశాల్ రెడ్డిలను నియమించారు. టీఎన్జీవో ప్రవర్తన నియామవళి ప్రకారం ఇరు యూనిట్ల అధ్యక్ష కార్యదర్శుల పదవులతో సహా అన్ని పదవులకు గాను సింగిల్ సెట్ నామినేషన్ దాఖలు కావడం వలన టీఎన్జీవో...