Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 December 2024, 8:13 pm Posted by : ramakrishna

టీఎన్జీఓ అర్బన్, రూరల్ యూనిట్ కమిటీ ఎన్నిక

నిజామాబాద్, బతుకమ్మ: టిఎన్జీవో కేంద్ర సంఘ అధ్యక్షులు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ఎస్ఎం. హుస్సేని ఆదేశానుసారం బుధవారం టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్ ఆధ్వర్యంలో 2024-2027 సంవత్సరానికి టీఎన్జీఓ అర్బన్, రూరల్ యూనిట్ ల ఎన్నికలు నిర్వహించారు. ఎన్నిక అధికారులుగా వనమాల సుధాకర్, జి.సంజీవయ్య,  దినేష్ బాబు, విశాల్ రెడ్డిలను నియమించారు. టీఎన్జీవో ప్రవర్తన నియామవళి ప్రకారం ఇరు యూనిట్ల అధ్యక్ష కార్యదర్శుల పదవులతో సహా అన్ని పదవులకు గాను సింగిల్ సెట్ నామినేషన్ దాఖలు కావడం వలన టీఎన్జీవో అర్బన్, రూరల్ యూనిట్ల ఎన్నికలు ఏకగ్రీవం అయినట్టుగా అర్బన్ యూనిట్ ఎన్నికల అధికారి వనమాల సుధాకర్, రూరల్ యూనిట్ ఎన్నికల అధికారి గుడికందుల సంజీవయ్య ప్రకటించారు. టిఎన్జీవో అర్బన్ యూనిట్ అధ్యక్షులుగా జాకీర్ హుస్సేన్( నీటిపారుదల శాఖ), కార్యదర్శిగా ఎన్.మారుతి (ట్రెజరీ శాఖ), రూరల్ యూనిట్ అధ్యక్షులుగా జ్ఞానేశ్వర్ రెడ్డి (వ్యవసాయ శాఖ), కార్యదర్శిగా కే.శ్రీనివాస్ (అటవీ శాఖ) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం ఏకగ్రీవంగా ఎన్నికైన ఇరు యూనిట్ల అధ్యక్ష, కార్యదర్శులను, కార్యవర్గ సభ్యులను టిఎన్జీవో జిల్లా పక్షాన అభినందించి, పూలమాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. టీఎన్జీవో అర్బన్, రూరల్ యూనిట్ల ఎన్నికలు ఏకగ్రీవం కావడానికి సహకరించిన ప్రతి ప్రాథమిక సభ్యునికి టిఎన్జీవో జిల్లా పక్షాన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపారు.   ప్రతి ఒక్కరూ టీఎన్జీవో సంఘం యొక్క ఔన్నత్యం పెంచడానికి కృషి చేయాలని ఉద్యోగుల సమస్యల పోరాటానికి సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి సహాధ్యక్షులు చిట్టి నారాయణ రెడ్డి, కేంద్ర బాధ్యులు పోల శ్రీనివాస్, కోశాధికారి ఎస్.దినేష్ బాబు బాబు, ఉపాధ్యక్షులు మంజుల, అతిక్, సంయుక్త కార్యదర్శులు జాఫర్ హుస్సేన్, మహేందర్, జిల్లా కార్యవర్గ సభ్యులు ప్రకాష్, ఇందిరా పాల్గొని ఎన్నికైన సభ్యులను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

Election of TNGO Urban and Rural Unit Committee