నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : సంస్కార భారతి ఇందూర్ మహానగర కమిటీని ప్రాంత సంఘటన్ మంత్రి నిరంజన్ ఆదివారం సంఘ కార్యాలయంలో ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కలల మాధ్యమంగా పంచవర్ధన్ కార్యక్రమాన్ని ప్రజల మధ్యకు తీసుకోకు వెళ్లాలని సూచించారు. ఈ సందర్భంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులను ఆయన ప్రకటించారు. అధ్యక్షులుగా రాజ్ కుమార్ సుబేదార్, ఉపాధ్యక్షులుగా సముద్రాల నివాసచారి, మోహన్ రెడ్డి, బున్ని మల్లేష్, జయప్రద, చిరంజీవాచారి. ప్రధాన కార్యదర్శిగా పెండం కార్తీక్ లను ఎన్నుకున్నారు. కార్యదర్శులుగా వినోద్ గౌడ్, వరలక్ష్మి, రమణాచారి, నితీష్ మలాని, పవన్ కుమార్, కోశాధికారిగా రాధాకృష్ణ. మాతృ శక్తి కన్వీనర్ గా మాధురి, ప్రచార ప్రముఖం గా బెజుగం శ్రీకాంత్, మంచిగా కళా విభాగ కన్వీనర్ గా ఎన్ రవికుమార్, దృశ్యకళా విభాగ కన్వీనర్ గా పాముల నవీన్ లోపు కళా విభాగ్ కన్వీనర్ తోట ప్రశాంత్, సాహిత్య కళ విభాగ కన్వీనర్ శ్రీమన్నారాయణ చారి, విరాట్ కళాధరోహర్ విభాగ్ కన్వీనర్ శ్రీ పురుషోత్తమాచారి లను ఎన్నుకున్నారు. కార్యవర్గ సభ్యులుగా కళ్యాణి, రచనా, దేశం రజిని, సాయి రెడ్డి, శివ, నాగమణి, కురవ రాము, శ్రీనివాస్ రెడ్డి, సముద్రాల మధుసూదనాచారి ఎన్నికున్నారు. ఈ సందర్భంగా సంస్కార్ భారతీయ నిర్వహించే కార్యక్రమాలపై చర్చించారు.