బతుకమ్మ,ఏర్గట్ల: ఏర్గట్ల గ్రామ విశ్వ బ్రాహ్మణ యూత్ కార్యవర్గ ఎన్నిక లో యూత్ అధ్యక్షులు గా రాజరపు నర్సయ్య, కోశాధికారి గా పరికిపండ్ల నరేష్ ను విశ్వబ్రాహ్మణ యూత్ సభ్యులు సమావేశం ఏర్పాటు చేసుకొని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. యూత్ అధ్యక్షుడు రాజారపు నర్సయ్య మాట్లాడుతూ ఏర్గట్ల మండల కేంద్రంలో విశ్వబ్రాహ్మణ యూత్ సంఘాన్ని ఏడు సంవత్సరాల క్రితం స్థాపించడం జరిగిందని ఈ సంవత్సరం తనపై ఎంతో నమ్మకంతో సంఘ యూత్ సభ్యులు తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్న యూత్ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమములో విశ్వ బ్రాహ్మణ యూత్ సభ్యులు రాజారపు నరేష్, నాచుపల్లి వంశీ, అక్కు నూరు వాసు అక్కునూరు నరసయ్య, రాజారపు నవీన్, యూత్ సభ్యులు పాల్గొన్నారు.