ప్రజానాట్య మండలి నగర ఏరియా కమిటీ ఎన్నిక
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నగరంలోని మల్లు స్వరాజ్యం ట్రస్ట్ లో ప్రజానాట్య మండలి నగర ఏరియా కమిటీని గురువారం ఎన్నకున్నారు. ఈ సందర్భంగా ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి సిర్పలింగం మాట్లాడుతూ ప్రజానాట్యమండలి 1943 లో ఏర్పడి ఈనాటికి 80 సంవత్సరాలు దాటిందన్నారు. ఈ నాట్యమండలి నుండి అనేక కళారూపాలు సామాజిక రుగ్మతలపై నాటికలు వీధి నాటికలు ప్రదర్శించారని తెలిపారు. అక్షరాస్యత, సారా ఉద్యమం, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ఇలాంటి కార్యక్రమాల్ని తీసుకొని ప్రజల మధ్యకు కళారూపాన్ని తీసుకువెళ్లిందని తెలిపారు. 23న జరిగే...