భిక్కనూరు, బతుకమ్మ :
మండలంలోని పెద్ద మల్లారెడ్డి గ్రామంలో భారతీయ జనతా పార్టీ గ్రామ అధ్యక్షుడిగా మెట్టు స్వామి, ప్రధాన కార్యదర్శిగా బండమీది రాజును మండల పార్టీ అధ్యక్షుడు ఉప్పరి రమేష్ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు నూతనంగా ఎన్నికైన వారిని అభినందించి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ ప్రధాన కార్యదర్శులు అత్తిలి తిరుమలేష్, పొన్నాల రంజిత్, మండల కిసాన్ మోర్చా అధ్యక్షుడు జైపాల్ రెడ్డి, జిల్లా నాయకులు యాదగిరి గౌడ్, వల్లకొండ రవీందర్ రెడ్డి, పిట్ల రాజయ్య, తదితరులు పాల్గొన్నారు.