Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 April 2025, 9:07 pm Posted by : ramakrishna

టీజీఈజేఏసీ జిల్లా నూతన కమిటీ ఎన్నిక

  • జేఏసీ జిల్లా ఛైర్మన్ గా నాశెట్టి సుమన్ కుమార్

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్, రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఏలూరీ శ్రీనివాస్ ఆదేశానుసారం గురువారం నగరంలోని టీఎన్జీవో జిల్లా కార్యాలయం లో టీజీఈజేఏసీ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. కార్యక్రమంలో భాగంగా మొదటగా టీజీఓ జిల్లా అధ్యక్షులు అలుక కిషన్ మాట్లాడుతూ.. టీజీఈజేఏసీ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్ పేరును ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్ పదవికి  ప్రతిపాదించగా… టీజీఈజేఏసీ  భాగస్వామ్య సంఘాల జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు, సభ్యులందరూ ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్ గా  నాశెట్టి సుమన్ కుమార్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.  టీజీఈజేఏసీ జిల్లా కన్వీనర్ గా టీజీఓ జిల్లా అధ్యక్షులు అలుక కిషన్, కో కన్వీనర్ గా పీఆర్టీయూ మోహన్ రెడ్డి  కో చైర్మన్ లు గా యూటీఎఫ్ రమేష్, టీజీఆర్ఈఎస్ఏ ఎల్ రమణ రెడ్డి, ఎస్ఠీయూ ధర్మేందర్, క్లాస్ ఫోర్ అసోసియేషన్ శ్రీనివాస్, టీఆర్ఠీఎఫ్ కృష్ణారెడ్డి,టీపీటీఎఫ్ సురేష్,టీటీయూ రాము లతీకర్, Govt.JLs.Assn. నర్సయ్య, డీటీఎప్ బాలయ్య, పెన్షనర్ అసోసియేషన్ రవీందర్ వైస్ చైర్మన్ గా టీఎన్జీవో జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్, టీజీఓ జిల్లా అధ్యక్షులు సంఘం అమృత్ కుమార్, ఫైనాన్స్ సెక్రటరీ జాకీర్ హుస్సేన్ తదితరులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం రాష్ట్ర కమిటీ కూర్పు మేరకు జిల్లాలో  కూర్పు ఏర్పరచుకొని, ఏకగ్రీవంగా ఎన్నికైన అనంతరం రాష్ట్ర కమిటీ తెలిపిన 57 అంశాల ఉద్యోగుల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి రాష్ట్ర నాయకత్వం ప్రకటించిన కార్యచరణ ప్రకారంగా జిల్లాలో కూడా ఉద్యమాలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

Election of new TGEJAC district committee