Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 August 2025, 4:44 pm Posted by : ramakrishna

ప్రైవేట్ డిగ్రీ కళాశాలల యాజమాన్యాల నూతన కార్యవర్గం ఎన్నిక

  • ప్రధాన కార్యదర్శిగా నరాల సుధాకర్

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని ప్రైవేటు కళాశాలల యాజమాన్య నూతన కార్యవర్గాన్ని మంగళవారం కామారెడ్డిలో జరిగిన జనరల్ బాడీ సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా కామారెడ్డి ఆర్కే కాలేజీ సీయీవో జయపాల్ రెడ్డిను, ప్రధాన కార్యదర్శిగా కేర్ డిగ్రీ కళాశాల అధినేత నరాల సుధాకర్ ను, కోశాధికారిగా బోధన్ మీమ్స్ డిగ్రీ కాలేజీ యజమాని శ్రీనివాస్ రాజును, ఉపాధ్యక్షులుగా డిచ్పల్లి ఎస్పీఆర్ కాలేజీ యజమాని అరుణ్ రెడ్డి, బాన్సువాడ శశాంక్ డిగ్రీ యజమాని సయ్యద్ హకీం ను సంయుక్త కార్యదర్శిగా సిద్దార్థ కాలేజి నవీన్ ను, లీగల్ అడ్వైజర్ గా ప్రముఖ న్యాయవాది మాజీ పీపీ రాజేందర్ రెడ్డి ని ఎన్నుకున్నారు. గత అధ్యక్ష కార్యదర్శులుగా పనిచేసిన హరిప్రసాద్, సంజీవరెడ్డి కి వీడ్కోలు సందర్భంగా సన్మానించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ…. ప్రైవేటు కాలేజీల సమస్యల పరిష్కారానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని అన్నారు. అసోసియేట్ ప్రధాన కార్యదర్శి నరాల సుధాకర్ మాట్లాడుతూ…. ప్రైవేటు డిగ్రీ కళాశాలలు చాలా సమస్యలను ఎదుర్కొంటున్నాయని అన్నారు. చాలా కాలేజీలు మూత పడుతున్నాయని అన్నారు. కాలేజీలకు మునుపటి వైభవాన్ని తీసుకురావడానికి కృషి చేస్తామని నరాల సుధాకర్ అన్నారు. ఎన్నికల అధికారులుగా, కామారెడ్డి కాలేజి హరిస్మరణ్, బోధన్ ఉషోదయ కళాశాల సూర్యప్రకాశ్, ఆర్మూర్ నరేంద్ర కళాశాల శంకర్ ఎన్నికలు సజావుగా సాగేందుకు కృషి చేసారని అన్నారు. ఈ కార్యక్రమంలో మారయ్య గౌడ్, హరి ప్రసాద్, సుజన్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, సంజీవ్, బాలాజీ, హకీం, విజయ్, గిరి, నవీన్, విజయ్, తదితరులు పాల్గొన్నారు.

Election of new executive committee of private degree college managements