నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :నిజామాబాద్ జిల్లా ఆలిండియా బంజారా సేవా సంఘం నిజామాబాద్ జిల్లా సమన్వయ కమిటీ కన్వీనర్ కేతావత్ యాదగిరి నాయక్ ఆధ్వర్యంలో ఆదివారం నిజామాబాద్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం జాతీయ మాజీ అధ్యక్షులు అమర్ సింగ్ తిలవత్, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రనాయక్, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం అసోసియేట్ ప్రెసిడెంట్ మోహన్ సింగ్, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తారాచంద్ నాయక్, నిజాంబాద్ జిల్లా మాజీ అధ్యక్షులు, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం గౌరవ అధ్యక్షులు చంద్రు నాయక్ హాజరయ్యారు. నిజామాబాద్ జిల్లా అధ్యక్షులుగా మూడ్ బాబు రామ్ నాయక్, ప్రధాన కార్యదర్శిగా కొర్ర గంగాధర్ నాయక్, కోశాధికారిగా దియావత్ శంకర్ నాయక్, ఉపాధ్యక్షులుగా మోహన్ నాయక్, చందర్ నాయక్, కేతావత్ ప్రకాష్ నాయక్, మూడ్ తారాచంద్, మలవత్ రాములు నాయక్, జిల్లా కార్యదర్శిలుగా బాదావత్ బలరాం నాయక్, జరుపల భీమ్లా నాయక్, జాదవ్ గణేష్ నాయక్, జిల్లా సంయుక్త కార్యదర్శిగా బానోత్ జీవన్, మాలవత్ రమేష్ నాయక్, ధరం సోద్ మోహన్ నాయక్, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శిగా అడ్వైజర్ సంగు నాయక్, సోషల్ మీడియా ఇంచార్జ్ గా కేతావత్ సురేష్ నాయక్ లను ఎన్నుకున్నారు.