భీమ్ గల్, బతుకమ్మ: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యువజన సంఘం భీంగల్ మండల నూతన కమిటీని బుధవారం నియమించి నట్లు అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు లింగన్న తెలియజేశారు. బాల్కొండ నియోజకవర్గం ఇన్చార్జి జనార్ధన్ ఆధ్వర్యంలో జరిగినట్టు పేర్కొన్నారు. భీంగల్ మండల అధ్యక్షులు సుద్దులం సునీల్, ఉపాధ్యక్షులు పతాని రంజిత్, గట్టు శ్రావణ్ ప్రధాన కార్యదర్శి మద్దూరి భాస్కర్, కార్యనిర్వాహణ అధ్యక్షులు గంట ప్రమోద్, బుక్క రవి ప్రచార కార్యదర్శి దుమ్మాల రాజు మండల సలహాదారుడు విగ్నేష్ లను నియమించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు జయరాజ్ తదితరులు పాల్గొన్నారు.