Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 December 2024, 8:08 pm Posted by : ramakrishna

ధర్మ టీచర్స్ యూనియన్ జిల్లా కమిటీ ఎన్నిక

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ధర్మ టీచర్స్ యూనియన్ జిల్లా కమిటీని రాష్ట్ర కమిటీ బాధ్యులు నాగేశ్వర రావు, రాజు ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. నగరంలోని కార్యాలయంలో ఆదివారం జిల్లా ప్రతినిధుల సమావేశం నిర్వహించి ఈ కమిటీని ఎన్నుకున్నారు.  జిల్లా అధ్యక్షులుగా గుమ్మడి చంద్రశేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా పెద్ది సుదర్శన్, జిల్లా ఉపాధ్యక్షులుగా గద్దల రమేష్, జిల్లా మహిళా ఉపాధ్యక్షులుగా నలూరి రాజమణి, జిల్లా కార్యదర్శులుగాగద్దల సాయినాథ్, ప్రసాద్ లను ఎన్నుకున్నారు. జిల్లా కార్యవర్గ సభ్యులుగా మోహన్, పోషన్న, శంకర్, రాజన్న, మోహన్, వినోద్, సుధాకర్, సురేష్, రాజ్ కుమార్ లను కమిటీ సభ్యులు  ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో డీటీయూ ప్రతినిధులు  నాగేశ్వర్ రావు, చంద్ర శేఖర్, సుదర్శన్, రమేష్, సాయినాథ్, రాజు, వినోద్, సురేష్, సంతోష్ పాల్గొన్నారు.