Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 June 2025, 6:02 pm Posted by : ramakrishna

ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం కార్యవర్గం ఎన్నిక

  • అధ్యక్షులుగా తుకారం నాయక్

 

ఇందల్వాయి, బతుకమ్మ: ఇందల్వాయి మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయంలో మంగళవారం ఆల్ ఇండియా బంజారా సేవ సంఘం ఆధ్వర్యంలో నాయకులు సర్వసభ్య సమావేశం నిర్వహించి నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగాఎన్నుకున్నారు. అధ్యక్షులుగా తుకారం నాయక్,ప్రధాన కార్యదర్శిగా బి రవీందర్ నాయక్,వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధప రమేష్ నాయక్, పాత్య రెడ్డి నాయక్, కోశాధికారిగా మొజిరం నాయక్, ఉపాధ్యక్షులుగా సోమ్లా నాయక్,బొంబాయి మోతిరాం నాయక్,బాదావత్ వసంతరావు,కార్యదర్శులుగా దేవీ నాయక్, వాల్యానాయక్, గణపతి, జిల్లా కార్యవర్గ సభ్యులుగా మోతిలాల్ నాయక్ లను ఎన్నుకున్నారు.ఎన్నికల అధికారులుగా పీర్ సింగ్ నాయక్,రాజు నాయక్,పరశురాం నాయక్,మోహన్ నాయక్ ,సామ్య నాయక్,హుస్సేన్ నాయకులు ఎన్నికల నిర్వహణను పెట్టారు. అనంతరం అధ్యక్షులుగా ఎన్నికైన తుకారం నాయక్ మాట్లాడుతూ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం భవిష్యత్తులో బంజారాలకు రావలసిన రిజర్వేషన్లకు గాని ఇతర సమస్యల పట్ల గాని ముందుండి పోరాడుతానని అన్నారు,బంజారా సోదరులందరూ ఐక్యమృతంతో కలిసి మెలిసి ఉండి ఆల్ ఇండియా బంజారా సేవ సంఘం ఎప్పుడు ఏ పిలుపునిచ్చిన ఎక్కడికి రావాలని పిలిచిన ఏకధాటిగా పెద్ద ఎత్తున తరలిరావాలని అన్నారు.అందరు ఏకంగా ఉండి సమస్యల పట్ల పోరాడినప్పుడే తమకు న్యాయం జరుగుతుందని అన్నారు.ఇప్పటికే బంజారా లు చాలా వెనుకబడి ఉన్నామని మంత్రివర్గంలో కూడా ఎస్టీలకు మంత్రి పదవి ఇవ్వకపోవడం చాలా బాధాకరమన్నారు.ఇప్పటికైనా సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి ఎస్టీలకు మంత్రి పదవిని ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రమేష్ నాయక్, బంజారా సోదరులు యువకులు,నాయకులు పెద్ద మొత్తంలో పాల్గొన్నారు.