Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 December 2024, 4:31 pm Posted by : ramakrishna

84వ బూత్ కమిటీ ఎన్నిక

ఆర్మూర్, బతుకమ్మ : ఆర్మూర్ పట్టణంలో గల రాజారాం నగర్ లో బీజేపీ 84వ బూత్ కమిటీని బుధవారం ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా కార్యదర్శి గంగోనె సంతోష్, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కలిగోట గంగాధర్, పోల్కం వేణు  పాల్గొన్నారు. ఎన్నికల అధికారిగా భారత్ వ్యవహారించారు బూత్ అధ్యక్షులు గా ఏం.సురేష్, కార్యదర్శి గా సిహెచ్.రమణ, లాభర్తి ప్రాముఖ్ గా బి.నగేష్, మన్ కీ బాత్ ప్రముఖ్ గా జి.రఘు, వాట్సప్ ప్రముఖ్ గా ఎం.సందీప్, బి ఎల్ ఏ -2 గా టీ. రాకేష్, పన్న ప్రముఖ్ లను ఎన్నుకున్నారు. బీజేపీ జిల్లా నాయకులు గంగోనె సంతోష్, కలిగోట గంగాధర్ మాట్లాడుతూ బీజేపీ లో బూత్ కమిటీ కి చాలా ప్రాధాన్యత ఉంటుందని అన్నారు. లోకసభ అసెంబ్లీ ఎన్నికల్లో కష్టపడి బీజేపీ అభ్యర్థులు ధర్మపురి అరవింద్, పైడి రాకేష్ రెడ్డి ఆకాండ మెజారిటీ తో గెలిపించారని తెలిపారు. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలం అయిందని, రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను  ప్రజల వద్దకు తీసుకెళ్లి బీజేపీ పార్టీని బూత్ లెవల్లో పటిష్టం చెయ్యాలని కోరారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో బీజేపీ సత్తా  చాటలని కోరారు.  ఎన్నికైన బూత్ కమిటి ని సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు రమణ, కార్యకర్తలు పాల్గొన్నారు.