జిల్లా ఎన్నికల అధికారితో ఎలక్షన్ అబ్జర్వర్ భేటీ
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : మున్సిపల్ ఎన్నికల జనరల్ అబ్జర్వర్ గా నియమితులైన తెలంగాణ టెక్నాలజికల్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ సీహెచ్.సత్యనారాయణ రెడ్డి బుధవారం కలెక్టరేట్ లో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠితో భేటీ అయ్యారు. జనరల్ అబ్జర్వర్ కు పూలమొక్క అందించి స్వాగతం పలికిన కలెక్టర్, జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు.చేసిన ఏర్పాట్ల గురించి తెలియజేశారు. ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా పూర్తి పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకున్నామని అన్నారు. కాగా, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి జనరల్ అబ్జర్వర్...