నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
మున్సిపల్ ఎన్నికల జనరల్ అబ్జర్వర్ గా నియమితులైన తెలంగాణ టెక్నాలజికల్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ సీహెచ్.సత్యనారాయణ రెడ్డి బుధవారం కలెక్టరేట్ లో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠితో భేటీ అయ్యారు. జనరల్ అబ్జర్వర్ కు పూలమొక్క అందించి స్వాగతం పలికిన కలెక్టర్, జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు.చేసిన ఏర్పాట్ల గురించి తెలియజేశారు. ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా పూర్తి పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకున్నామని అన్నారు. కాగా, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి జనరల్ అబ్జర్వర్ కు ఫిర్యాదులు, సూచనలు చేయదలచిన వారు సెల్ నెంబర్: 95533 95000 కు ఫోన్ చేయవచ్చని, మెయిల్ ఐ.డీ: mngdirector-tgts@telangana.gov.in ద్వారా కూడా తెలుపవచ్చని ఎన్నికల పరిశీలకులు సత్యనారాయణ రెడ్డి సూచించారు. ఈ భేటీలో నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, నోడల్ ఆఫీసర్ ఫర్ మైక్రో అబ్జర్వర్ సునీల్ ఉన్నారు.
