ఎన్నికల విధులను జాగ్రత్తగా నిర్వర్తించాలి

కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్   కామారెడ్డి, బతుకమ్మ : గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలను ఎలక్షన్ కమిషన్ నియమ, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం ఎల్లారెడ్డి, మధ్యాహ్నం బాన్సువాడ రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులకు పంచాయతీ ఎన్నికల మొదటి దశ నిర్వహణ తీరుతెన్నులపై అవగాహన కల్పించేందుకు శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, చట్టబద్ధతతో కూడిన ఎన్నికల విధులను జాగ్రత్తగా...