నిస్పక్షపాతంగా ఎన్నికల విధులు నిర్వర్తించాలి : కలెక్టర్ హరిత
రాజన్న సిరిసిల్ల, బతుకమ్మ:రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారులు నిస్పక్షపాతంగా విధులు నిర్వర్తించాలని కలెక్టర్ హరిత ఆదేశించారు.స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన నేపథ్యంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్( ఎంసీసీ)పై వివిధ శాఖల జిల్లా అధికారులు, ఎంపీడీఓలు, ఎంపీఓలకు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో మంగళవారం శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హరిత హాజరై మాట్లాడారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తరువాత ఎలాంటి రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో అధికారులు, సిబ్బంది పాల్గొన కూడదని స్పష్టం చేశారు. విధుల్లో భాగంగా ...