హైకోర్టు ఆదేశాలను అమలు చేస్తామన్న ఎలక్షన్‌ కమిషన్‌

హైదరాబాద్, బతుకమ్మ : హైకోర్టు ఆదేశాలను అమలు చేస్తామని ఎలక్షన్‌ కమిషన్‌ ప్రకటించింది. ఎన్నికల నోటిఫికేషన్‌పై స్టే ఇవ్వడంతో ఎన్నికల ప్రక్రియ నిలిచింది. హైకోర్టు ఉత్తర్వుల తర్వాత ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తూ ఎలక్షన్‌ కమిషన్‌ గెజిట్‌ విడుదల చేయనుంది. గెజిట్‌ విడుదల చేసిన వెంటనే ఎన్నికల ప్రక్రియ నిలిచిపోనుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్‌ను ఎత్తివేయనుంది.