తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల తేదీలు ప్రకటించిన ఎన్నికల సంఘం

హైదరాబాద్, బతుకమ్మ : తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల తేదీలు ఎన్నికల సంఘం ప్రకటించింది. డిసెంబర్ 11 – మొదటి విడత, డిసెంబర్ 14– రెండవ విడత, డిసెంబర్ 17 – మూడవ విడత మొత్తం మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల సంఘం కమిషనర్ తెలిపారు. తొలి విడత నామినేషన్ నవంబర్ 27, రెండవ విడత నామినేషన్ నవంబర్ 30, మూడవ విడత నామినేషన్ డిసెంబర్ 3వ తేదీ నుండి మొదలు అవుతాయని ప్రకటించారు.