Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 February 2025, 6:23 pm Posted by : ramakrishna

ఎమ్మెల్సీ గ్రాడ్యుయేషన్ పట్టభద్రుల ఎన్నికల ప్రచారం

రుద్రూర్, బతుకమ్మ : ఎమ్మెల్సి గ్రాడ్యుయేషన్ పట్టాబద్రుల ఎన్నికల ప్రచారం లో భాగంగా భారతీయ జనతా పార్టీ బలపరిచిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్న మైల్ అంజిరెడ్డికి మద్దతుగా కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం రుద్రూర్ మండలంలోని రుద్రూర్ గ్రామంలో ప్రచారం చేయడం జరిగింది. ఇందులో భాగంగా గ్రాడ్యుయేట్ ఓటర్ ఇంటి దగ్గరికి వెళ్లి చిన్న మెయిల్ అంజి రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వెయ్యమని అభ్యర్థించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రుద్రూర్ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ, జిల్లా కౌన్సిల్ మెంబెర్ ప్రశాంత్ గౌడ్, మండల సీనియర్ నాయకులు కటిక రామ్ రాజ్, పార్వతి మురళి,  చిదురా మహిపాల్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.