ఎన్నికల పోరు… ప్రచార జోరు…

  బాన్సువాడ, బతుకమ్మ :   పురపాలక ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ రాజకీయ వేడి రోజురోజుకూ పెరుగుతోంది. బాన్సువాడ మున్సిపాలిటీలో బుధవారం నుంచి ప్రధాన పార్టీలన్నీ ప్రచార రంగంలోకి దిగడంతో వార్డులన్నీ పండుగ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. రంగంలోకి ముఖ్యనేతలు... ప్రచార రథాలు, బైకులు, ఆటోలు, పార్టీ బ్యానర్లు.. ఇలా ప్రతి వీధిలోనూ నినాదాల ప్రతిధ్వని వినిపిస్తోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రధాన నేతలతో పాటు , సీనియర్ క్యాడర్, డివిజన్ స్థాయి నాయకులు కూడా బూత్ల వారీగా ప్రచారాన్ని ముమ్మరం చేశారు. వార్డుల వారీగా క్యాడర్...