బాపూజి వచనాలయంలో ఎన్నికల సందడి
నిజామాబాద్ సిటి, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని ప్రముఖ బాపూజి వచనాలయం నూతన కార్యవర్గం కోసం ఎన్నికలకు రంగం సిద్దమైంది. గత పాలకవర్గం కాలపరిమితి ముగియనుండడంతో 2024-2029కి సంబంధించిన నూతన కార్యవర్గం ఎన్నికకు ఎన్నికల అధికారులు శ్రీహరి ఆచార్య, పులి జైపాల్ లు నామినేషన్ల స్వీకరణ ప్రారంభించారు. నూతనంగా అధ్యక్ష, కార్యదర్శి, ఉపాధ్యక్షులు, సంయుక్త కార్యదర్శి, కోశాధికారితో పాటు 12 మంది కార్యవర్గ సభ్యుల ఎన్నికకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. బాపూజి వచనాలయంలో శాశ్వత సభ్యులకు, రెండు సంవత్సరాల క్రితం సభ్యత్వం తీసుకున్న...