Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 July 2026, 8:13 pm Posted by : ramakrishna

గుండెపోటుతో వృద్ధురాలి మృతి

 

ఇందల్వాయి, బతుకమ్మ :

 

ఇందల్వాయి మండల కేంద్రంలోని తీర్మన్ పల్లి గ్రామానికి చెందిన గోత్రాల సాయవ్వ (65) శనివారం గుండెపోటుతో మరణించినట్లు మృతురాలి అల్లుడు బండారి బాలకృష్ణ తెలిపారు. మృతురాలికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె కలదు. వివరాల్లోకి వెళ్తే గోత్రాల సాయవ్వ గత 25 సంవత్సరాలుగా జాడు కట్టలు కట్టుకుంటూ జీవనం సాగించేదని కుటుంబ సభ్యులు తెలిపారు. వయసు పై పడటంతో అనారోగ్యానికి గురై శనివారం గుండెపోటుతో మరణించినట్లు బండారి బాలకృష్ణ తెలిపారు.