Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 November 2025, 3:45 pm Posted by : ramakrishna

నిజాంసాగర్ కెనాల్ లో పడి వృద్దురాలు మృతి

నందిపేట్, బతుకమ్మ :

 

నందిపేట్ మండల కేంద్రం లోని పలుగుట్ట సమీపంలోని నిజాంసాగర్ కెనాల్ లో గుర్తు తెలియని మృత్తుదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందడం తో పోలీసులు సంఘటన స్థలానికి పరిశీలించారు. మృతురాలు బోర్గాం(పి) శ్రామిక్ నగరకు చెందిన కైరి గంగామణి గా గుర్తించారు. వెంటనే వారి బంధువులు కు సమాచారం అందించడంతో మృతురాలి తమ్ముడు గంగాధర్ గౌడ్ కైరి గంగామణిగా నిర్ధారించారు. మృతురాలు కైరి గంగామణి గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతుందని, ఈ నెల 5న కార్తీక పౌర్ణమి సందర్బంగా పలుగుట్టకు దైవ దర్శననానికి వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి తిరిగి రాలేదని అన్నారు. కళాకాకృత్యాల కోసం మృతి చెంది ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం చేశారు. మృతురాలి  తమ్ముడు ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని  మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన్నట్లు ఎస్.ఐ. శ్యామ్ రాజ్ తెలిపారు.

Elderly woman dies after falling into Nizamsagar Canal