ప్రమాదవశాత్తు కాలువలో పడి వృద్ధురాలు మృతి
రుద్రూర్, బతుకమ్మ: ప్రమాదవశాత్తు కాలువలో పడి ఓ వృద్ధురాలు మృతి చెందిన ఘటన రుద్రూర్ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై సాయన్న తెలిపిన వివరాల ప్రకారం.. రుద్రూర్ గ్రామానికి చెందిన గైని సరవ్వ(80) గ్రామంలో నూతనంగా నిర్మాణ పనులు చేపడుతున్న బ్రిడ్జి వద్ద తెల్లవారు జామున ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతి చెందినట్లు తెలిపారు. మృతురాలు బిక్షాటన చేస్తూ జీవనం కొనసాగించేదన్నారు. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.