రోడ్డు ప్రమాదంలో వృద్ధుడి మృతి
ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డి మండలం సబ్దల్పూర్ గ్రామానికి చెందిన గడ్డం పోచయ్య హోలీ పండుగ సందర్భంగా మటన్ తీసుకెళ్లేందుకు ఎల్లారెడ్డికి వచ్చారు. మటన్ తీసుకొని తిరిగి వెళుతుండగా, గాంధీ చౌక్ వద్ద ముందు నుండి ఆటో అతివేగంగా వచ్చి పోచయ్యను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. కుటుంబ సభ్యులు హైదరాబాద్ కు చికిత్స నిమిత్తం తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ఆయన మృతిచెందారు. ఈ ఘటనపై మృతుని అన్న కుమారుడు గడ్డం లచ్చయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు...