Batukammanews
Newspaper Banner
Date of Publish : 31 March 2025, 2:54 pm Posted by : ramakrishna

ఘనంగా ఈద్ మిలాప్ వేడుకలు

రుద్రూర్, బతుకమ్మ : రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని రుద్రూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణం వద్ద సోమవారం బాన్సువాడ బ్లాక్ కాంగ్రెస్- బి ఆధ్వర్యంలో ఈద్ మిలాప్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రంజాన్ పండుగ సందర్బంగా ముస్లిం సోదరులు ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించి, ఈద్ మిలాప్ వేడుకలలో పాల్గొని కుల మత బేదాలు లేకుండా ఒకరి నొకరు అలైబలై తీసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇందూరి చంద్రశేఖర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తోట అరుణ్ కుమార్, కాంగ్రెస్ నాయకులు పత్తి రాము, ఇందూరి కార్తీక్, తోట సంగయ్య, బద్దం సంజీవ్ రెడ్డి, కర్క అశోక్, కుర్మాజి సాయిలు, షేక్ సుభాని, ముస్లిం సోదరులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.