ఈద్ మీలాద్ ఉన్ నబీ వేడుకలు

రుద్రూర్, బతుకమ్మ: రుద్రూర్ మండల కేంద్రంలో సోమవారం ముస్లిం సోదరులు ఈద్ మిలాద్ ఉన్ నబి పర్వదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. ముస్లిం మత పెద్దల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. రుద్రూర్ మండల కేంద్రంతో పాటు అక్బర్ నగర్, సులేమాన్ నగర్ గ్రామాలలో ఈద్ మిలాద్-ఉన్- నబీ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులు ఆధ్యాత్మిక ఊరేగింపులు నిర్వహించారు. ఈ ఊరేగింపులో ముస్లిం సోదరులు గుర్రాలు, పచ్చజెండాలు చేతబుని  భక్తిశ్రద్ధలతో అల్లాహ్, మహమ్మద్ ప్రవక్తను స్మరిస్తూ భక్తిగీతాలు ఆలపించారు. ముస్లిం సోదరుల ఆధ్యాత్మిక ర్యాలీతో రుద్రూర్...